హిమాచల్ ప్రదేశ్ లో పాపం బీజేపీ

హిమాచల్ ప్రదేశ్ లో పాపం బీజేపీ
x
Highlights

కాంగ్రెస్ ముక్త భారత్ సాధించే దిశగా దూసుకుపోతున్న బిజెపి తాజాగా హిమాచల్ ప్రదేశ్ ను తన ఖాతాలో వేసేసుకుంది.. మంచుకొండల్లో కమలం వికసించింది.. ప్రతీ సారి...

కాంగ్రెస్ ముక్త భారత్ సాధించే దిశగా దూసుకుపోతున్న బిజెపి తాజాగా హిమాచల్ ప్రదేశ్ ను తన ఖాతాలో వేసేసుకుంది.. మంచుకొండల్లో కమలం వికసించింది.. ప్రతీ సారి లాగే ఈసారి కాంగ్రెస్ నుంచి బిజెపికి అధికార మార్పిడి జరిగిపోయింది. మోడీ హిందూత్వ వాదానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారనే అంటున్నారు విశ్లేషకులు

మంచుకొండల్లో కమలం వికసించింది.. ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి విజయ దుందుభి మోగించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమలం తాజాగా హిమాచల్ లో గెలిచి19వ రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ముక్త భారతాన్ని సాధించాలంటూ పిలుపునిచ్చిన బిజెపి హిమాచల్ లో గెలిచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే బిజెపి సిఎం అభ్యర్ధి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోవడం ఒక విచిత్రం.. ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలు అభివృద్ధి మంత్రాన్నే జపించాయి. కొండకోనల్లో ఉండే హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి ఎన్నికల బరిలో మౌలిక వసతులు, ఉపాధి, మైనింగ్ మాఫియాను అడ్డుకోడం అన్న అంశాలే ప్రచారాస్త్రాలుగా నిలిచాయి.ప్రజా రవాణా వ్యవస్థ, యువతకు ఉద్యోగాలు, మహిళా సాధికారత, భ్రదత, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ సరఫరా, రోడ్లు, తాగునీరు అంశాలు ఎన్నికల అంశాలుగా మారాయి. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధే ప్రధానాంశంగా మారిందని రెండు పార్టీలూ ఒప్పుకున్నాయి.


హిమాచల్ ప్రదేశ్ లో అధికారం రెండు పార్టీల మధ్యే అటూ , ఇటూ మారుతూ ఉంటుంది.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలు మార్పు కోరుకుని బిజెపికి ఓటేశారు..మోడీ, అమిత్ షా కలసి కట్టుగా చేసిన ఎన్నికల ప్రచారం కూడా కమలదళానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి..దాదాపు ఏడు ఎన్నికల ర్యాలీలలో ఇద్దరూ కలసి పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రచారమే సరిగా చేసుకోలేకపోయింది. గుజరాత్ పై సర్వ శక్తులూ ఒడ్డిన రాహుల్ హిమాచల్ కు ఒకే ఒక్కసారి వచ్చి ఒక్క ర్యాలీలో మాత్రం పాల్గొన్నారు.. ఇక అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా కనీసం ఒక్కసారి కూడా రాష్ట్ర పర్యటనకు రాకపోవడం పార్టీకి మైనస్ గా మారింది. బిజెపి ప్రాభవాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించాలన్న పట్టుదలతో ఉన్న మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక హిమాచల్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. విజన్ డాక్యుమెంట్ పేరుతోె హిమాచల్ అభివృద్ధికి ప్రత్యేక పథకాలు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ కు ఎయిమ్స్ కేటాయించిన మోడీ శంకుస్థాపన కూడా చేశారు.


అలాగే ఎన్నో పథకాలు కూడా ఆ రాష్ట్రానికి ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన అవనీతి ఆరోపణలనూ బిజెపి గట్టిగానే ప్రస్తావించింది. మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల భద్రత అంశాన్ని చేర్చింది. పైగా పెచ్చు పెరిగిపోయిన డ్రగ్ మాఫియాను వీరభద్రసింగ్ సర్కార్ కట్టడిచేయలేకపోయిందనే విమర్శలూ పెరిగాయి. అలాగే గెలుపు ఓటములను ప్రభావితం చేసే వలస టిబెటన్లు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోడం కూడా ఎన్ని కల ఫలితాల సరళిని మార్చేసింది..బిజెపి గెలుపుకు ఇవన్నీ కారణాలు కాగా.. సిఎం అభ్యర్ధి, బిజెపి అధ్యక్షుడు, పాలనానుభవం కలిగిన నేత, ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోవడం బిజెపికి పెద్ద దెబ్బ. సిఎం అభ్యర్ధే ఓడిపోవడంతో ఆలోచనలో పడిన బిజెపి అతని స్థానంలో కేంద్ర మంత్రి నడ్డా అభ్యర్ధిత్వాన్ని పరిశీలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories