పర్సు దొంగతనం చేసి.. దేవుడు చూశాడని..

Submitted by nanireddy on Sun, 07/15/2018 - 16:04
preity-zinta-shared-video-then-it-goes-viral

దొంగతనాలు చేయడంలో ఒక్కొక్క దొంగది ఒక్కో స్టైల్.. కొందరేమో ఇళ్లల్లో ఎవరూలేని సమయాల్లో  దూరి దోచేస్తారు.. ఇంకొందరు సినిమాహాళ్లు జనాలు ఎక్కువగా ఉన్న చోట దొంగతనం చేస్తారు.. కానీ ఇతను మాత్రం సీసీ కెమెరా కనిపించేలా చేసి దేవుడికే అడ్డంగా బుక్కయినట్టున్నాడు. చేసిన తప్పుకు దేవుడిని క్షమాపణ కోరాడు. నటి ప్రీతిజింతా షేర్ చేసిన వీడియోలో  ఓ వ్యక్తి  తన బైక్ ను రిపేర్ చేసుకుంటున్నాడు. ఇంతలో  ఓ దొంగ వచ్చి  అతని వెనుక జేబులో ఉన్న పర్సు  దొంగతనం  చేశాడు. అయితే  పర్సు తీసుకుని వెనక్కి తిరిగి చూసుకున్నాడు.. వెనకాల సీసీ కెమెరాలు చూసి షాకైయ్యాడు. దీంతో అడ్డంగా దొరికిపోతానేమోనని కొద్ది సేపటి తరువాత సదరు వ్యక్తికి మీ పర్సు  కిందపడిందని చెప్పి ఇచ్చాడు. అనంతరం సీసీ కెమెరా వైపు చూస్తూ పైవాడు(దేవుడు) చూస్తున్నాడు నన్ను క్షమించు అని వేడుకుని అక్కడినుంచి జారుకున్నాడు. ఈ దృశ్యాలను ప్రీతీ జింతా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చెయ్యడంతో వైరల్ గా మారాయి. 

English Title
preity-zinta-shared-video-then-it-goes-viral

MORE FROM AUTHOR

RELATED ARTICLES