ఉగ్ర కాల్పుల్లో గాయపడి పండంటి బిడ్డకు జన్మ

ఉగ్ర కాల్పుల్లో గాయపడి పండంటి బిడ్డకు జన్మ
x
Highlights

రెండ్రోజుల క్రితం జమ్ము కశ్మీర్ సుంజ్వాన్ ఉగ్రదాడిలో గాయపడిన గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఆర్మీ కార్టర్స్‌లో ఉగ్రవాదులు జరిపిన...

రెండ్రోజుల క్రితం జమ్ము కశ్మీర్ సుంజ్వాన్ ఉగ్రదాడిలో గాయపడిన గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఆర్మీ కార్టర్స్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. రైఫిల్‌మ్యాన్ నజీర్‌ అహ్మద్‌తోపాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. 35 వారాల గర్భిణి అయిన ఆమెను హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో సైనిక ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. సత్వారీలోని మిలటరీ ఆసుపత్రిలో సిజేరియన్ చేసిన తర్వాత ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

సంజ్వాన్ మిలటరీ శిబిరంపై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన సమయంలో రైఫిల్ మ్యాన్ నజీర్ అహ్మద్ భార్య తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆమె వెన్నుపూసలోకి తూటా దూసుకెళ్లింది. ఆమె 9 నెలల గర్భిణీ కావడంతో బిడ్డపై ఆశలు వదులుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ గర్భిణీని, ఆమె కడుపులోని బిడ్డను బ్రతికించడానికి ఆర్మీ డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. సిజేయరిన్ ఆపరేషన్ చేసి శిశువుకు పురుడు పోశారు. పాప బరువు రెండున్నర కిలోలుంది. ప్రస్తుతం తల్లికి బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ డాక్టర్లు తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఇదో అద్భుతమని ఆర్మీ డాక్టర్లు సంబర పడ్డారు.

Image removed.

Show Full Article
Print Article
Next Story
More Stories