ప్రకాష్ రాజ్ ... ఇలా ప్రకాశించినాడు.

Submitted by chandram on Tue, 12/04/2018 - 16:32
prakashraj

ప్రకాష్ రాజ్  అనగానే ఎన్నో విలన్, ఎన్నో అద్భ్తమైన పాత్రలు గుర్తుకువస్తాయి... ఇతను..దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడు. ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు. నటనలో ఎన్నో వైవిధ్యాలు మన ప్రకాష్ రాజ్ ప్రదర్శిస్తారు. నటన పట్ల ఒక అంకితభావం ప్రకాష్ రాజ్ లో మనకి కనబడుతుంది.   శ్రీ.కో.

English Title
Prakash Raj ... shined like this.

MORE FROM AUTHOR

RELATED ARTICLES