ఎట్టకేలకు పెళ్లిపై స్పష్టం చేసిన ప్రభాస్..

Submitted by nanireddy on Tue, 06/19/2018 - 15:14
prabhas final talk by his marraige

 టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి. ఏ ఇద్దరు కలిసి సినిమాల గురించి చర్చించుకున్నా వీరి పెళ్లి గురించే.. కొద్ది రోజులుగా ప్రభాస్, అనుష్క లిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలో ఇద్దరు కలిసి ఏడడుగులు నడవనున్నట్టు రూమర్లు హల్చల్ చేశాయి. వీటిని పలుమార్లు ప్రభాస్, అనుష్క లు ఖండించారు.అయినా కూడా రూమర్లు తెగ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ అనుష్కతో పెళ్ళికి సిద్దమయ్యారన్న టాక్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. దీంతో స్వయంగా ప్రభాస్ సదరు రూమర్లపై క్లారిటీ ఇచ్చేసాడు. అనుష్కతో పెళ్లి వార్తలను ఖండించిన ప్రభాస్.. తామిద్దరం స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశాడు. అలాగే తన పెళ్లి గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. 'వివాహం అన్నది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. దాని గురించి ఏం మాట్లాడదల్చుకోలేదు. ఆ ముహూర్తం వచ్చినప్పుడు ఖచ్ఛితంగా నా అభిమానులకు నేనే చెబుతా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు' అని చెప్పాడు. కాగా ప్రభాస్ క్లారిటీతో ఇప్పటికైనా ప్రభాస్ అనుష్కలపై వస్తున్న రూమర్లకు ఫులుస్టాప్ పడుతుందో లేదో చూడాలి.  

English Title
prabhas final talk by his marraige

MORE FROM AUTHOR

RELATED ARTICLES