ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదు: పోసాని

Submitted by nanireddy on Fri, 12/07/2018 - 08:44
posani krishnamurali voted in yellareddygooda

ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. సనత్ నగర్ పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోసాని  శుక్రవారం ఉదయం నగరంలోని ఎల్లారెడ్డిగూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ పోలింగ్ స్టేషన్ కు వచ్చారు. అక్కడ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదట పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగా లేని కారణంగా ఓటు వేసేందుకు ఇబందిపడ్డారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయట మాట్లాడుతూ... ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు ఇబ్బంది పడతారని పోసాని అన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు పోసాని. 

English Title
posani krishnamurali voted in yellareddygooda

MORE FROM AUTHOR

RELATED ARTICLES