బాబుకు పోసాని ఛాలెంజ్!

Submitted by arun on Wed, 03/21/2018 - 12:26
Posani

ప్రత్యేక హోదాపై స్పందించకుండా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఏసీ రూముల్లో కులుకుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమను అగౌరవపరిచేలా ఆయన మాట తీరు బాగోలేదని.. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటున్నారు చిత్ర ప్రముఖులు. తెలుగు రాష్ట్రాలకు ఏ సమస్య వచ్చినా చిత్ర పరిశ్రమ సాయానికి ముందు నిలిచిందని.. అలాంటిది కొందరు రాజకీయ నాయకులు పరిశ్రమను టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. ప్రత్యేక హోదాపై ఇప్పటికే కొందరు పోరాడుతున్నారని.. ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పారు. ప్రముఖ నటుడు, రచయిత, టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పోసాని కృష్ణ మురళీ ఇంకో అడుగు ముందుకేశాడు.

”హోదా కోసం విజయవాడ నడిరోడ్డుమీద ఆమరణ దీక్ష చేస్తా.. మీరూ వస్తారా?” అంటూ తెలుగుదేశం పార్టీ నేతల్ని సవాల్ చేశారు పోసాని. నేను ప్రాణాలు వదిలెయ్యడానికి కూడా సిద్ధం.. మీలో ఎవరికైనా ఆ తెగింపు ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మీద పిల్లిమొగ్గలేయడమే పనిగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి సినిమా వాళ్ళను విమర్శించే హక్కు లేదన్నది పోసాని ఆర్గ్యుమెంట్. టాలీవుడ్ తరఫున ఆమరణ దీక్షకు సిద్ధపడ్డానన్న పోసాని.. ఈ రకమైన నిర్ణయాన్ని ప్రకటించిన వాళ్లలో నాలుగోవారు. దీక్ష చేస్తానంటూ గుంటూరు సభలో పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే.. నీతో పాటు నేనూ కూర్చుంటానంటూ క్రిటిక్ కత్తి మహేష్ ట్వీట్ చేశారు. హీరో శివాజీ అయితే ప్రాణత్యాగం కోసం ఎప్పట్నుంచో సిద్ధంగా వున్నారు. మరి.. హోదా కోసం తెలుగు సినిమా ముందుకు రాలేదన్న ‘బాబూ’ వ్యాఖ్యలో హేతుబద్ధత ఎంత?

English Title
posani krishna murali sensational comments tdp chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES