ఫేస్‌బుక్ యూజర్లు ఇలా చేస్తే దొరికిపోతారు!

Submitted by lakshman on Thu, 09/21/2017 - 22:24

మీరేం చూస్తున్నారో ఫేస్‌బుక్ క్షణాలలో కనిపెట్టగలదు. కొంతమంది స్మార్ట్‌ఫోన్లలో పోర్న్ సైట్స్ ఓపెన్ చేసి చూస్తూ.. ఫేస్‌బుక్‌ను లాగ్ అవుట్ చేయకుడా వదిలేస్తుంటారు. అప్పుడు ఆ వెబ్‌సైట్‌లకు రిలేటెడ్ అయిన  ఫేస్‌బుక్ ప్లిగిన్స్ యాక్టివ్‌గా మారి, మీ సర్ఫింగ్ డేటాను ట్రాక్ చేసి , మీ ఇంటర్నెట్ ప్రైవసీ ఈజీగా కనిపెట్టే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు సెర్చ్ అడల్ట్ వెబ్‌సైట్స్‌కి రిలేటెడ్ సెర్చ్ రిజల్ట్స్ డేటా ట్రాక్ కాకుండా ఉండాలంటే, ఆ సైట్‌లలోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితముగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి లాగ్ అవుట్ చెయ్యాలి.  ఫేస్‌బుక్‌లో పోర్న్‌కు సంబంధించిన మాల్‌వేర్ చాలా ప్రమాదకరంగా మారింది. ఈ డేంజరస్ మాల్వేర్  లింక్‌లు సెకన్లలో ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్‌లను వైరస్‌లతో నింపుతాయి. ఆ తరువాత మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి మీ ఫ్రెండ్ ఎవరో షేర్ చేసినట్లు ఓ పోర్న్ లింక్ కనిపిస్తుంది.

ఆ లింక్‌పై తెలియక మీరు క్లిక్ చేస్తే కొద్ది సెకన్ల పాటు ఆ వీడియో ‘ప్లే' అయి ఆగిపోతోంది. ఆ తరువాత వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతుంది. డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసినట్లయితే మాల్‌వేర్ మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించి మౌస్, కీబోర్డ్‌ను తమ ఆధీనంలోకి లాగేసుకుంటుంది. ఈ ప్రమాదకర మాల్‌వేర్ మీకు తెలియకుండానే ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో మాల్‌వేర్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఆ లింక్‌‍లను క్లిక్ చేసిన వారు కూడా ఇదే తరహాలో దీనికి బలికాక తప్పదు. అందుకే అలాంటి లింక్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసినట్లు కనిపిస్తే దయచేసి క్లిక్ చేయకండి. మీ ఫ్రెండ్‌ను తప్పుబట్టి అతని స్నేహాన్ని దూరం చేసుకోకండి.

English Title
porn based malware attacks facebook users

MORE FROM AUTHOR

RELATED ARTICLES