వైవాహిక జీవితంలో చిచ్చుపెడుతున్న‌ పోర్న్ వీడియోలు

Submitted by lakshman on Sat, 03/17/2018 - 09:33
porn addiction recovery

పోర్న్‌ వీడియోలు చూసే వ్యక్తి క్రమంగా అందరికీ దూరమైపోయి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. పోర్న్‌ చూసే కాలం, పోర్న్‌ (మామూలు సంభోగం నుండి హింసాత్మకమైనవాటి వరకు) స్థాయి పెరిగే కొద్దీ ఈ ఒంటరితనం పెరుగుతుంది. పోర్న్‌ చూసేవారు జీవిత భాగస్వామిని గాయపరిచే అవకాశం ఎక్కువ. ఆమె ఇష్టాయిష్టాలు, ఇబ్బందులు లక్ష్యపెట్టకపోవడమే కాదు. క్రమంగా ఆమెతో మానసిక సాన్నిహిత్యానికి భయపడతారు.

ఆరోగ్యకరమయిన సహజ శారీరక సంబంధాలపై విముఖత ఏర్పడుతుంది. పోర్న్‌ చూస్తూఉండకపోతే లైంగిక తృప్తి పొందలేరు
 పోర్న్‌ సినిమాలపై మాటల్లో, చర్యల్లో ఆధిపత్యాన్ని, ఉద్రేకాన్ని, హింసను చూపుతాయి. నిజానికి లైంగిక హింసను స్త్రీలు ఆనందిస్తారని చెప్పి నమ్మిస్తాయి. కాబట్టి పోర్న్‌ వ్యక్తిని లైంగిక దాడికి మానసికంగా సన్నద్ధం చేస్తుంది. ఆలోచనల్నే కాక చేతల్ని కూడా ప్రభావితం చేయగలదు.

రాను రాను పోర్న్‌ మరింత క్రూరంగా, జుగుప్సాకరంగా నిర్ఘాంతపోయేంత అమానవీయంగా మారుతున్నది.
అక్రమ రవాణా నుండి వ్యభిచారం నుండి పోర్న్‌ను విడదీసి చూడటం ఎంతమాత్రం సాధ్యం కాదు.

 పోర్న్‌ వలన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం వృత్తి జీవితం కూడా దెబ్బతింటాయి.
కాబట్టి పోర్న్‌ను ఏ హానీ లేని వినోదంగా, భావ వ్యక్తీకరణగా చూడటం తప్పు.

ఎట్లా మానాలి?

పోర్న్‌ చూసే వ్యక్తి తాను చూసే అలవాటును మానేయాలని బలంగా కోరుకోవాలి. మారడానికి ప్రయత్నించాలి.

 ఎవరితోనైనా తన సమస్యను పూర్తి నిజాయితీతో తన సమస్యను పంచుకోవాలి.

 తన నెట్‌లో పోర్న్‌ రాకుండా బ్లాక్‌ చేసుకోవాలి. తనదగ్గర ఉన్నది తీసేయాలి.

ఎవరైనా మిత్రుల సహకారం తీసుకోవాలి. ఖాళీ లేకుండా ఇతర వ్యాపకాలు పెట్టుకోవాలి.

భార్య పిల్లలు బాధపడుతున్నారని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఒంటరిగా కంప్యూటర్‌తో ఆడకుండా భార్య పిల్లలతో కలిసి ఆపరేట్‌ చెయ్యాలి.

ఆరోగ్యకర లైంగిక సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. సాధ్యంకాకుంటే కౌన్సిలర్‌ సాయం తీసుకోవాలి.

English Title
porn addiction recovery

MORE FROM AUTHOR

RELATED ARTICLES