పూరి జగన్నాథ్ దర్శకుడిగా రామ్ మూవీ?

పూరి జగన్నాథ్ దర్శకుడిగా రామ్ మూవీ?
x
Highlights

'మెహబూబా' తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి, మళ్లీ మెగాఫోన్ బాట పట్టనున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ సినిమా చేయనున్నట్టు ఫిలింనగర్ టాక్. వరుస...

'మెహబూబా' తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి, మళ్లీ మెగాఫోన్ బాట పట్టనున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ సినిమా చేయనున్నట్టు ఫిలింనగర్ టాక్. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీ, యాక్షన్ తో ఈ కథ ఉంటుందని సమాచారం. వైష్ణో అకాడమీ, స్రవంతి మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరోవైపు తన తనయుడు ఆకాశ్ హీరోగా చేయనున్న సినిమాకి సంబంధించిన పనులను పూరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. రామ్ తో నయా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఆకాశ్ హీరోగా చేస్తున్న చిత్రం ద్వారా అనిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories