‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలనం

Submitted by lakshman on Sun, 01/21/2018 - 23:45
heroine poonam kaur


 హీరోయిన్ పూనమ్ కౌర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.  గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శ‌లు చేస్తున్న క‌త్తిమ‌హేష్ ను ఉద్దేశించి హీరోయిన్ పూన‌మ్ కౌర్ ప‌రోక్షంగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ పై స్పందించిన క‌త్తి ప్రెస్ మీట్ లో ఆమె పై వ్య‌క్తిగ‌త  విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించారు. ఆ త‌రువాత కోడి గుడ్ల‌దాడితో వివాదం తారాస్థాయికి చేర‌డంతో   మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ప‌రిష్క‌రించినట్లు తెలుస్తోంది. చిరు తమ్ముడు నాగేంద్రబాబు చొరవతోనే వివాదం ముగిసిందని  జనసేన నాయకుడు కల్యాణ్ సుంకర ఓ టీవీ ఛానల్ చర్చలో చెప్పారు. ‘ఈ అనవసర వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల‌ని  పవన్ అభిమానులకు  నచ్చజెప్పారు. నాగ‌బాబు ఆలోచ‌న , కత్తిమహేశ్ పెద్ద మనసు వ‌ల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. 
ఈ నేప‌థ్యంలో పూనమ్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. అయితే పవన్ కల్యాణ్ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని.. ఆ శక్తి ముందు ఎవరైనా కరిగిపోవాల్సిందే అనే విధంగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది.
 ఆమె చేసిన ట్వీట్:
‘‘పవిత్రంగా ఉండాలనే ఆలోచనే ఒక శక్తి. అది దైవశక్తి కంటే గొప్పది. అదే పీకే ప్రేమ. తెలుసుకోవాల్సింది ఇంకా ఏదైనా ఉందా? ఇంకా ఎవరైనా వస్తారా?’’ అంటూ  ట్వీట్ చేసింది. 

English Title
PoonamKaur sensational comments in twitter

MORE FROM AUTHOR

RELATED ARTICLES