కత్తి మహేష్ పై పరువు నష్టం దావా వేస్తాం

Submitted by arun on Mon, 01/08/2018 - 15:22

పవన్ కల్యాణ్, కత్తి మహేష్ మధ్య మొదలైన వివాదం ఓ మలుపు తీసుకుని... పూనం కౌర్, కత్తి మహేష్ మధ్య రాజుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా, కత్తి మహేష్ ను ఫ్యాట్సో, బెగ్గర్ అని వ్యాఖ్యానిస్తూ పూనం కౌర్ ట్వీట్ చేయడంతో గొడవ పెద్దదైపోయింది. ఈ నేపథ్యంలో పూనం కౌర్ కు ఇవే తన ప్రశ్నలంటూ ఓ ఆరింటిని కత్తి మహేష్ సంధించారు. వీటికి పూనం కౌర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వీటికి పూనం ఇంకా స్పందించలేదు. కానీ, ఆమె సోదరుడు శ్యాంసింగ్ మాత్రం స్పందించారు. తన సోదరికి ఏ దర్శకుడితోనూ విబేధాలు లేవని, కత్తి మహేష్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని శ్యాంసింగ్ చెప్పారు. నిఫ్ట్‌లో చదివిన పూనమ్‌కు చేనేతపై పూర్తి అవగాహన ఉందని, అందుకే ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిందని ఆయన అన్నారు. తన సోదరి పూనమ్‌కౌర్‌ను అవమానించిన కత్తి మహేష్‌పై పరువు నష్టం దావా వేస్తామని శ్యాంసింగ్ తెలిపారు.

Image result for poonam kaur brother

English Title
Poonam Kaur's brother reacts to Kathi Mahesh's 6 questions

MORE FROM AUTHOR

RELATED ARTICLES