ఆ దర్శకుడు మా జీవితాలతో ఆడుకుంటున్నాడు : పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు!

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 11:16
poonam-kaur-allegations-movie-directo

ఓ దర్శకుడు తమ జీవితాలతో ఆడుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. హీరో శ్రీకాంత్ సరసన తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా పవన్ కళ్యాణ్ అభిమాని అన్న ముద్ర వేసుకున్నారు. మూడు నెలల కిందట ఓ వివాదంలో చిక్కుకుని అనూహ్యంగా బయటపడ్డ పూనమ్ కౌర్.. తాజాగా ట్విట్టర్ లో ఓ వివాదాస్పద ట్వీట్ చేసింది.. దాని సారాంశం.. 'ఒక సినీ దర్శకుడు తనను తరచూ అవమానపరుస్తున్నాడని పూనంకౌర్‌ తన ట‍్వటర్‌లో పేర్కొన్నారు. ఆ దర్శకుడికి అధిక చిత్రాలేమీ లేవని, అయినా ఇతరుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడని, తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు.. అంతేకాకుండా అతని గురించిన బయటకు చెప్పరాని పలు విషయాలు తన వద్ద ఆధారాలు సహా ఉన్నాయి. అతనికి కావలసిన నటీమణులు నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్నా, వారికే అవకాశాలు ఇస్తున్నాడని తెలిపారు. ఇతరుల మనోభావాలను ఖూనీ చేస్తున్నాడని ఆరోపించారు' భవిష్యత్ లో అతను చేసిన తప్పులే అతన్ని శిక్షిస్తాయి' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ దర్శకుడు ఎవరా అని ఆరాతీసుతున్నారు సినీ అభిమానులు.

English Title
poonam-kaur-allegations-movie-directo

MORE FROM AUTHOR

RELATED ARTICLES