ఎన్టీఆర్ ను చూసి పూజా హెగ్డే భయపడుతోంది

Submitted by arun on Fri, 03/16/2018 - 14:29
Pooja Hegde

పూజా హెగ్డే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగుమతి అవడమే కాదు.. స్టార్ హీరోలకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. డీజే సినిమాలో అందాల ఆరబోతతో.. వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమాలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలో ఆమే.. హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు.. ప్రభాస్ తోనూ కమిట్ అయ్యింది.

ఈ విషయంపై పూజా మీడియాతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. మహేష్ బాగుంటాడని కితాబిచ్చింది. బన్నీతో డాన్స్ చేయడం సరదాగా ఉంటుందని కాంప్లిమెంట్ ఇచ్చింది. ప్రభాస్ చాలా హైట్ ఉంటాడని నవ్వేసింది. ఎన్టీఆర్ దగ్గరికి వచ్చే సరికి కాస్త అలర్ట్ గా మాట్లాడింది. ఎన్టీఆర్ ఏ సీన్ ను అయినా.. ఒకే టేక్ లో చేస్తాడన్న పేరు ఉన్న విషయాన్ని పూజా స్పెషల్ గా ప్రస్తావించింది.

ఆ విషయంలో తాను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది. సెట్ కు వెళ్లే ముందే జాగ్రత్తపడితే షూట్ టైమ్ లో టెన్షన్ ఉండదని అనుకుంటున్నట్టు చెప్పింది. దీంతో.. పూజాహెగ్డే ముందు జాగ్రత్తను అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రిపరేషన్ మాటలకే కాకుండా.. చేతల్లోనూ కొనసాగించి చూపిస్తే.. టాప్ హీరోయిన్ రేంజ్ కు పూజా ఎదగడం ఖాయమని కూడా ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
 

English Title
Pooja Hegde happy to work with top Telugu stars

MORE FROM AUTHOR

RELATED ARTICLES