బీసీ నేతకు టికెట్ నిరాకరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి

Submitted by arun on Fri, 11/09/2018 - 17:18

ఎన్నికల్లో తాను పోటీ చేసిన జనగామ టికెట్ ను తెలంగాణ జన సమితికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు వస్తున్న వార్తలపై సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రచారం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ హైకమాండ్ టీజేఎస్‌కు జనగామ టికెట్‌ను కేటాయించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ టీజేఎస్‌కు తన నియోజకవర్గాన్ని అప్పగిస్తే అధికార టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందని పొన్నాల హెచ్చరించారు.  ఒకవేళ జనగామ అసెంబ్లీ నియోజకవర్గాన్ని త్యాగం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరితే తాను హైకమాండ్‌తో మాట్లాడుకుంటానని స్పష్టం చేశారు. తనలాంటి బీసీ నేతలకు అన్యాయం చేయడం సరికాదని పొన్నాల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English Title
Ponnala Lakshmaiah Face to Face

MORE FROM AUTHOR

RELATED ARTICLES