ఉదయం 11గంటలకు 23.17శాతం పోలింగ్‌

Submitted by arun on Fri, 12/07/2018 - 11:21
polling

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వైపు అడుగులు వేశారు. ఉదయం 11గంటల వరకూ 23.17శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈవీఎంలు మొరాయించినట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, దివ్యాంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. వరంగల్‌ జిల్లాలో 22శాతం పోలింగ్ నమోదు కాగా‌, మెదక్‌ జిల్లాలో 14శాతం, నిజామాబాద్‌లో 11శాతం మహబూబ్‌నగర్‌లో 12శాతం పోలింగ్‌ నమోదైంది.

English Title
polling percentage in telangana till 11 o clock

MORE FROM AUTHOR

RELATED ARTICLES