ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు...అదుపు తప్పితే చర్యలు తప్పవంటున్న ఈసీ

Submitted by arun on Fri, 11/09/2018 - 11:44

మాటల తూటాలు పేలుతున్నాయి... ప్రచార పరిధి మర్చిపోయి హద్దులు దాటుతున్నారు.. అభివృధ్దిపై పోటీ పడాల్సిన వారు స్థాయి మరిచి విమర్శలకు దిగుతున్నారు ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల నేతలు విమర్శ, ప్రతివిమర్శలు చేస్తూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ప్ర‌జాస్వామ్యం‌లో ఇలాంటి పద్ధతి సరైనది కాదంటున్న ఈసీ అదుపు తప్పితే చర్యలు తప్పదంటోంది. 

తెలంగాణలో ఎన్నికలు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మ‌రో నాలుగు రోజుల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా విడుదల కానుంది అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ మినహా ఎవరూ అభ్యర్థులను ప్రకటించలేదు కానీ అన్ని పార్టీల నేతలూ ప్రచార పర్వం ప్రారంభించారు. అయితే ప్రచారంలో గెలిస్తే ఏం చేస్తారో, ఇప్పుడున్న పాలకులు ఎక్కడ విఫలమయ్యారో చెప్పడం మాని ఇష్టానుసారం విమర్శలు చేసుకుంటున్నారు పార్టీ విధి విధానాలకంటే నాయకుల వ్యక్తిగత విషయాలపై దూషణలు చేసుకుంటున్నారు మళ్లీ ఎన్నికల కమిషన్ కి ఈ విషయంపై ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా తాజాగా గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్ రెడ్డి హరీష్ రావుపై వ్యక్తిగత దూషణలు చేశారు ఇక హన్మకొండలో టీటీడీపీ రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా హరీష్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒకవేళ హాంగ్ వస్తే తన వర్గంతో హరీష్ బయటకు వచ్చి సీఎం అవుతారని ఆయన అన్నారు దీంతో ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదులు చేశారు ఇదే కాకుండా శివం పేటలో రేవంత్ రెడ్డి తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని కేసీఆర్ పై  వ్యక్తిగత విమర్శల చేయడంతో ఆయనపై కంప్లైంట్ చేశారు గులాబీ నాయకులు.

నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు వ్యక్తిగత విమర్శలతో స్థాయిని తగ్గించు కోవద్దంటున్నారు. అసభ్య పదజాలంతో ప్రచారం చేయోద్దంటూ సూచిస్తున్నారు మొత్తానికి అన్ని పార్టీల అభ్యర్థులూ ప్రకటించిన తర్వాత ఈసీ చెబుతునట్లు వారి వారి మ్యానిఫెస్టోలపై ప్రాచారం చేస్తారో పరువు పోగొట్టుకునే మాటలు మాట్లాడతారో చూడాలి.

English Title
Political Parties Election Campaign Turns Hot Topic In Telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES