తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్‌లు...వందల కోట్ల రూపాయలకు...

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్‌లు...వందల కోట్ల రూపాయలకు...
x
Highlights

తెలంగాణ ఎన్నికల జ్వరం ఏపీలో వేడి పుట్టిస్తోంది. తెలంగాణ ఫలితాలపై ఏపీలో జోరుగా పందేలు కాస్తున్నారు. లగడపాటి సర్వేతో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఒకటి...

తెలంగాణ ఎన్నికల జ్వరం ఏపీలో వేడి పుట్టిస్తోంది. తెలంగాణ ఫలితాలపై ఏపీలో జోరుగా పందేలు కాస్తున్నారు. లగడపాటి సర్వేతో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఒకటి రెండు కాదు వందల కోట్ల రూపాయలకు పందేలు చేరుకుంటున్నాయి. ప్రజాఫ్రంట్ దే అధికారమంటూ చాలా మంది కాయ్ రాజా కాయ్ అంటున్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. పార్టీలవారీగా, అభ్యర్థులవారీగా, మెజారిటీలవారీగా రకరకాల పందేలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా జోరుగా సాగుతున్నాయి. పోలింగ్‌కు ముందు మొదలైన ఈ బెట్టింగులు పోలింగ్‌ తేదీ నాటికి కొంత శాంతించాయి. ఈ ఎన్నికల్లో ‘కారుదే హవా’ అంటూ జాతీయ చానళ్లు ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌తో బెట్టింగ్స్‌కు విరామం లభించింది. జాతీయ చానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత ప్రజాఫ్రంట్‌కు ప్రజల పట్టం అంటూ లగడపాటి సర్వే తేల్చడంతో మళ్లీ ఏపీలో పందేల ఊపు మొదలైంద పోలింగ్‌ శాతం అధికారికంగా వెల్లడి కావడంతో ఆ జోరు మరింత పెరిగింది. ఎవరికివారు మళ్లీ తమ తమ అంచనాలతో పందేలు కాస్తున్నారు.

గతంలో బెట్టింగ్‌లు వ్యక్తిగత స్థాయిలో జరిగేవి. ఇప్పుడు బృందాల మధ్య జరిగేవే ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యక్తుల మధ్య నడిచే పందేలు లక్ష రూపాయల లోపు ఉంటే గ్రూపుల బెట్టింగులు 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నడుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువుగా ఉంది. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పందేలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో తెలంగాణ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఫోన్లలో ఎక్కువ మంది ఫలితాలే గురించి మాట్లాడుతున్నారు. ప్రజా ఫ్రంట్‌ గెలుపుపైనే ఎక్కువ మంది పందేలు కట్టారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే నష్టం భారీగా ఉంటుందని మధ్యవర్తులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories