పొలిటికల్‌ బాల్‌ గేమ్‌లో దిమ్మెతిరగే కౌంటర్‌ స్ట్రాటెజీలు

పొలిటికల్‌ బాల్‌ గేమ్‌లో దిమ్మెతిరగే కౌంటర్‌ స్ట్రాటెజీలు
x
Highlights

కర్ణాటక రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయ్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప...అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాల్సి...

కర్ణాటక రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయ్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప...అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం నాలుగు గంటలకు జరిగే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. సుప్రీం ఆదేశాలతో కంగుతిన్న బీజేపీ.. హడావుడిగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకునే ప్రయత్నాల్లో పడింది. 104 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి....మిగతా సభ్యులు ఎక్కడి నుంచి వస్తారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.

కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు అసెంబ్లీకి మారాయ్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప....మూడు రోజుల సీఎమా ? లేదంటే ఐదేళ్ల సీఎం అన్నది మధ్యాహ్నం 4గంటలకు తేలిపోనుంది. యడ్యూరప్ప ప్రభుత్వానికి 111మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా....ప్రస్తుతం 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా ఏడుగురి మద్దతు సంపాదించేందుకు బీజేపీ నేతలు బేరసారాలు మొదలుపెట్టారు. మంత్రి పదవులతో పాటు కోట్ల రూపాయలు ఎర వేస్తున్నారు. బల పరీక్షలో విజయం సాధించేందుకు 8మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించారనే ప్రచారం జరుగుతోంది.

మధ్యాహ్నం అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో...కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మూడు బస్సుల్లో బెంగళూరు చేరుకున్నారు. అసెంబ్లీ వెళ్లేంత వరకు బెంగళూరు సిటీలోని రెసిడెంట్‌ హోటల్‌లో బస చేయనున్నారు. బలపరీక్షకు ముందు ప్రొటెం స్పీకర్‌ బోపయ్య....ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత యడ్యూరప్ప బలపరీక్ష ఎదుర్కోనున్నారు.

బల పరీక్షలో నెగ్గాలంటే యడ్యూరప్ప ముందు మూడు ఆప్షన్లున్నాయ్. కనీసం ఏడుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలి. రెండు 14 మంది ఓటింగ్‌కు గైర్హాజరు కావాలి. మూడోది 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. 14 మంది విపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. అంటే రాజీనామా చేసే ఎమ్మెల్యేలు... మొదట ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన రాజీనామాలు ఆమోదించే అధికారం ప్రొటెం స్పీకర్‌కు లేదు.

ప్రోటెం స్పీకర్‌గా యడ్యూరప్ప తనకు నమ్మకస్తుడైన బోపయ్యను ఎన్నుకున్నారు. బోపయ్య వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్‌ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, అసెంబ్లీ లోపల, వెలుపల శాంతి భద్రతల సమస్య సృష్టించి సభ జరగకుండా చేసి.. సభను స్పీకర్‌ వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. బల పరీక్షలో యడ్యూరప్ప నెగ్గినా, ఓడినా బీజేపీ నైతికంగా దెబ్బతిన్నట్లేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories