ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఆలస్యం..

Submitted by nanireddy on Fri, 12/07/2018 - 08:21
poling late in khammam distric

ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో  పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.  మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో ని 46 కేంద్రాల్లో వీవీ ఫ్యాడ్‌ పనిచేయకపోవడంతో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇటు మరిపెడ మండల కేంద్రంలోని 201,202,203,208 బూతుల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. భద్రాచలంలోను ఇదే పరిస్ధితి నెలకొంది.

ఏజెంట్లు ఆలస్యంగా రావడం, వీవీప్యాట్‌, ఈవీఎంల్లో సమస్యలు తలెత్తడంతో  ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కొత్తగూడం, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రారంభం కాలేదు. ఆలస్యమవుతుండటంతో ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు.   

English Title
poling late in khammam distric

MORE FROM AUTHOR

RELATED ARTICLES