వీహెచ్‌ ప్రచార రథానికి బ్రేక్ ...

Submitted by arun on Thu, 10/11/2018 - 12:45
vh

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన కాంగ్రెస్ సీనియర్‌ నేత వీహెచ్‌కు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. గన్‌పార్క్ దగ్గర నివాళులు అర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార రథానికి ఈసీ అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రచార రథానికి ఈసీ అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పోలీసులు చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఈసీ కార్యాలయానికి బయలుదేరారు.  

English Title
police stopped vh election campaign bus

MORE FROM AUTHOR

RELATED ARTICLES