హీరాగోల్డ్‌ కేసులో విచారణ వేగవంతం

x
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్‌ కేసు విచారణను. సీసీఎస్‌ పోలీసులు వేగవంతం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్‌ హెడ్‌ ఆఫీస్‌లో...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్‌ కేసు విచారణను. సీసీఎస్‌ పోలీసులు వేగవంతం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్‌ హెడ్‌ ఆఫీస్‌లో మరోసారి తనిఖీలు చేపట్టి. కీలక ఆధారాలు సేకరించారు. అయితే నౌహీరా కూడబెట్టిన వేల కోట్ల డిపాజిట్లు. హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం తనిఖీలు కొనసాగుతాయని. ఉన్నతాధికారులు చెబుతున్నారు.

గోల్డ్‌ స్కీమ్‌ పేర్లతో. వేలాది కోట్ల డిపాజిట్లు సేకరించి. జెండా ఎత్తేసిన నౌహీరా షేక్‌ కేసు విచారణలో సీసీఎస్ పోలీసులు. మరిన్ని ఆధారాలను సేకరించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హీరా గోల్డ్‌ కేంద్ర కార్యాలయంలో శనివారం రోజంతా సీసీఎస్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 9 బృందాలుగా ఏర్పడిన పోలీసులు. సోదాలు నిర్వహించారు. వీరితో పాటు.క్లూస్‌‌టీమ్, ఫోరెన్సిక్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డిపాజిట్‌ దారుల వివరాలు సేకరించారు.

దేశవ్యాప్తంగా వేలమంది అమాయకులను ముంచిన నౌహీరా షేక్‌. 9 వందల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. 16 రాష్ట్రాల్లో హీరాగోల్డ్‌ కంపెనీలతో పాటు. మొత్తం 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. అతి తక్కువ కాలంలోనే వేల కోట్ల టర్నోవర్‌ చూపించిన నౌహీరాపై చాలామంది డిపాజిట్‌ దారులు కంప్లైంట్లు చేశారు. ఇప్పటికి 43 ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించిన పోలీసులు.. దుబాయ్‌లో హోటల్‌, అపార్ట్‌మెంట్‌ లను కూడా ఉన్నట్లు తేల్చారు. దీంతో డిపాజిట్ల ద్వారా సేకరించిన సొమ్ముతో విదేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నట్లు స్పష్టమైనట్లు పోలీసులు తెలిపారు.

మొట్టమొదట. హీరా గోల్డ్‌ సంస్థపై 2012 లోనే తిరుపతిలో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ యేడాది బంజారాహిల్స్‌ పోలీసులు. పలు సేక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. తీవ్రత దృష్ట్యా. కేసును సీసీఎస్‌ కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు మొత్తం 8 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆమే సేకరించిన డిపాజిట్లన్నీ.. హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నారు. మరోవైపు బెయిల్‌పై బయటకు వచ్చిన నౌహీరాను పోలీసులు ముంబైకి తరలించి. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories