యూపీ బులంద్‌షహర్‌‌లో హింసాత్మకం..

Submitted by chandram on Mon, 12/03/2018 - 17:17
 uttar pradesh

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఎన్నికల మూడ్‌తో వివిధ రాష్ట్రాలకు ప్రచారానికి వెళుతుంటే సొంత రాష్ట్రంలో మాత్రం  ప్రచారం  శాంతి భద్రలు అదుపు తప్పుతున్నాయి. హింసాత్మక సంటనలు జరుగుతున్నాయి. బులంద్‌షహర్‌‌లో తాజాగా  హింసాత్మక సంఘటనలు జరిగాయి. గో హత్య జరిగినట్లు వార్తలు రావడంతో గో సంరక్షకులు రోడ్లపైకి వచ్చి చెలరేగిపోయారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. విధ్వంసకారుల దాడిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ ప్రాణాలు కోల్పోయారు. ఓ పోలీస్ వ్యానుకు కూడా నిప్పు పెట్టారు.
 
సయనలోని ఓ గ్రామం నుంచి ఓ వ్యానులో ఆవులను తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో గో సంరక్షకులు రోడ్లపై వాహనాలు నడవకుండా అడ్డంకులు పెట్టడంతోపాటు, ధర్నా చేశారు. దీంతో పోలీసులకు, గో సంరక్షకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల చర్యలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అల్లరి మూకలు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశాయి. కొందరు రాళ్ళు విసిరారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.
 

English Title
UP: Police officer killed in protest over alleged cow slaughter in Bulandshahr

MORE FROM AUTHOR

RELATED ARTICLES