టీచర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు...ఆందోళనకు దిగిన బాధిత కుటుంబంపై పోలీస్ జులుం

Submitted by arun on Tue, 10/09/2018 - 14:30
kolkata

కోల్‌కత్తా లో ఓ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తెపై స్కూల్ టీచర్  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్‌పై  దాడికిపాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు కూడా ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యం పోలీసుల సాయంతో తల్లిదండ్రులను అడ్డుకున్నారు.  అయితే, పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేశారు. తల్లిదండ్రులను చితకబాదారు. కనికరం లేకుండా ప్రవర్తించారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English Title
Police in Kolkata clash with parents

MORE FROM AUTHOR

RELATED ARTICLES