సినీనటుడు బాలాజీపై ఫిర్యాదు.. కిడ్నీ మోసం!

Submitted by nanireddy on Wed, 05/09/2018 - 11:50
police case files against acter balaji

సినీ నటుడు బాలాజీపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదయింది. అతన్ని వెంటనే పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. సినీ, బుల్లితెర నటుడు బాలాజీ భార్య కృష్ణవేణికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి దీంతో బాలాజీ కిడ్నీ దాతకోసం సంప్రదిస్తుండగా డబ్బు అవసరమయి భాగ్యలక్ష్మి అనే ఓ మహిళ తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రూ. 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా ముందస్తుగా 3 లక్షలు భాగ్యలక్ష్మి కి ఇచ్చాడని.. మిగిలిన డబ్బు ఇవ్వమంటే బెదిరిస్తున్నాడని ఆమె జూబ్లీహిల్స్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమెకు బాసటగా నిలిచారు సినీ నటి శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలో పోలీసుస్టేషన్ కు వచ్చిన బాలాజీ తన దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలు, బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించారు.  

English Title
police case files against acter balaji

MORE FROM AUTHOR

RELATED ARTICLES