ఎమ్మెల్యే కదలికలను మావోయిస్టులకు అందజేసిన ఎంపీటీసీ

ఎమ్మెల్యే కదలికలను మావోయిస్టులకు అందజేసిన ఎంపీటీసీ
x
Highlights

అరకు ఘటనలో మావోల ఘాతుకం మాత్రమే కాదు.. రాజకీయ కోణం కూడా వెలుగు చూస్తోందా..? కిడారి, సోమలను నమ్మిన వారే నట్టేట ముంచేసారా.. అంటే అవుననే సమాధానం...

అరకు ఘటనలో మావోల ఘాతుకం మాత్రమే కాదు.. రాజకీయ కోణం కూడా వెలుగు చూస్తోందా..? కిడారి, సోమలను నమ్మిన వారే నట్టేట ముంచేసారా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. అరకు జంట హత్యల కేసులో దర్యాప్తు వేగవంతం అవుతున్నకొద్దీ.. నివ్వేరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.

అరకులో మావోయిస్టుల దాడులకు ఎమ్మెల్యే కిడారి, సోమ బలి అవ్వడం వెనుక అయిన వాళ్ల నయవంచన ఉందనే అనుమానాలు నిజం అయ్యాయి. ఎంపీటీసీ సుబ్బారావు, మావోయిస్టులకు ఏమ్మేల్యే కదలికలను అందజేసారన్న వాస్తవాలు సిట్ విచారణలో వెలుగు చూసింది. ఎంపీటీసీ సుబ్బారావు, ఏమ్మేల్యే కిడారికి అత్యంత ఆప్తుడు. మాజీ ఏమ్యేల్యే సివేరు సోమకు దగ్గరి బందువు. ఆయన ఏమ్మేల్యే కదలికలు బాగా తెలిసిన వ్యక్తి. ఇదే మావోస్టులకు బలంగా మారింది. సుబ్బారావు, మావోలకు చేరవేసిన సమాచారంతోనే వారి వ్యూహం సఫలీకృతం అయింది. తాజాగా సిట్ బృందం విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కిడారి ఫోన్ డేటా పరిశీలించిన తరువాత పోలీసులవు సుబ్బారావును అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో మావోలకు సుబ్బరావే సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు. ఘటన జరగడానికి ముందు మూడు రోజులు వారికి సుబ్బారావే, ఆశ్రయం ఇవ్వడంతో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు విచారణలో తేలింది. కిడారి, సోమను చంపుతారని అనుకోలేదని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తరాని భావించానని సుబ్బారావు పొలిసులకు తెలిపారు. మావోయిస్టులు తనను బెదరించడం వల్లే, ఎమ్మెల్యే, సోమల సమాచారం ఇచ్చానని చెప్పాడు. ఎంపీటీసీ సుబ్బారావుతో పాటు మరో ముగ్గురు నేతలకు కూడా ఈ హత్యలతో ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను త్వరలోనే సీఎంకు అందజేయనున్నారు.

ఏమ్మేల్యే లివిటిపుట్టుకు బయలు దేరినప్పుడు, ఆయన కారులో బారీ మొత్తంలో డబ్బు ఉన్నట్లు పోలిసులు గుర్తించారు. అయితే, ఆ డబ్బు మైనింగ్ సెటిల్ మెంట్ కు తీసుకువెళ్లారా లేక మావోస్టులకు ఇచ్చేందుకు తీసుకువెళ్లారా అన్న అనుమానాలు వస్తున్నాయి. లివిటిపుట్టు గ్రామంలో జరిగిన దాడి తరువాత కారులో వున్న డబ్బులు కనిపించలేదు. దీనిపై కూడా పోలిసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు విచారణ పేరుతో గ్రామస్థులను అదుపులోనికి తీసుకుంటే, గిరిజనులు తిరగబడే అవకాశం ఉండటంతో సిట్ బృందం.. ఆచి,తూచి విచారణ సాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories