తూర్పు మన్యంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ...కీలకనేత అరెస్ట్‌

Submitted by arun on Mon, 10/08/2018 - 14:22
Podium Muda

తూర్పు మన్యంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ హిడుమా దళానికి చెందిన కీలకనేతను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిడుమా దళానికి ప్రస్తుతం డిప్యూటి కమాండర్‌గా ఉన్న పుడియం ముడా అలియాస్‌ మల్లేష్‌ ను నిన్న సాయంత్ర తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై 165 కేసులున్నాయి. మహేంద్ర కర్మతో పాటు 2007లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన 198 మంది పోలీసుల హత్యకాండలో ఇతను నిందితుడిగా ఉన్నాడు.   2011లో లొంగిపోయినట్టు నటించి పొలంపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు తీసుకెళ్లాడు.  భద్రాచలం మండలం చర్ల దగ్గర సంచరిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా  మల్లేష్ నుంచి భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.  
 

English Title
Police Arrest Iduma Betalian Deputy Commander Podium Muda

MORE FROM AUTHOR

RELATED ARTICLES