నీరవ్‌ మోదీని పట్టిస్తాం..

Submitted by nanireddy on Thu, 06/28/2018 - 08:37
PNB-scam-updates

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను అడ్డంగా ముంచి వేదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతడి పాస్‌పోర్టులను రద్దు చేయాలని ముంబై పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కోరింది. నీరవ్ మొత్తం ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉండగా.. ఒకదానిని ఇప్పటికే రద్దు చేశారు... మిగతా పాస్‌పోర్టులను రద్దు చేయాలని ముంబై కార్యాలయానికి ఈడీ కోరింది. మరోవైపు, నీరవ్ మోడీ యూరోపియన్ దేశాల్లో తలదాచుకున్నాడని తెలియడంతో ఆ దేశాలకు కేంద్ర విదేశాంగ శాఖ లేఖ రాసింది. నీరవ్ మోదీని గుర్తించడానికి సహకరించాలని ఆ దేశానికీ రాసిన లేఖలో పేర్కొన్నారు ఈడీ అధికారులు. నీరవ్‌పై దాఖలైన ఛార్జీషీట్ల ఆధారంగా బ్రిటన్‌, బెల్జియం సహా ఇతర దేశాల్లో వెతికేందుకు అనుమతి కోరుతూ ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నీరవ్‌ అప్పగింతకు సంబంధించి భారత్‌కు పూర్తిగా సహకరిస్తామని బెల్జియం ఇప్పటికే హామీ ఇచ్చింది.

English Title
PNB-scam-updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES