ప్రధాని బహిరంగసభలో అపశృతి...20 మందికి గాయాలు

Submitted by arun on Mon, 07/16/2018 - 15:19
Tent Collapse

పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ ప్రధాని మోడీ నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. ప్రధాని స్పీచ్ ఇస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ లో కొంత భాగం కూలిపోయింది. ఈఘటనలో 20 మంది గాయపడ్డారు. టెంట్ కూలిపోవడంతో ఆందోళనకు గురైన జనం పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగానే ఎక్కువ మంది గాయపడ్డారు. ప్రధాని స్పీచ్ ఇస్తున్న సమయంలోనే టెంట్ కూలడం ఆయన వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. స్పీచ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Image result for PM Bengal Rally Tent Collapse

Image result for PM Bengal Rally Tent Collapse

English Title
PM Tears Up On Meeting Those Hurt In Tent Collapse At His Bengal Rally

MORE FROM AUTHOR

RELATED ARTICLES