సిక్కింలో తొలి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోడీ

సిక్కింలో తొలి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోడీ
x
Highlights

ప్రధాని మోదీ సిక్కీంలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్‌లో విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ...

ప్రధాని మోదీ సిక్కీంలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్‌లో విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విమానాశ్రయం సిక్కీం ప్రజలకు ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2009లో పాక్యాంగ్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరగగా ఇది పూర్తవడానికి 9 ఏండ్లు పట్టింది. 201 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం పాక్యాంగ్ గ్రామానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. దీనికి 124 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాలో విమానాశ్రయం ఉంది. అక్టోబర్ 4 న ఈ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, కోల్‌కతా, గౌహతికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories