మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Submitted by arun on Sat, 02/10/2018 - 12:13
modi

మేధో వలసలను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా భారీగా ఉపకార వేతనాలను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి PhD చేసే రీసెర్చ్ స్కాలర్లకు నెలకు 70 నుంచి 80 వేల వరకు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించింది. IIT, NIT, IISER స్టూడెంట్లు....భావి శాస్త్రవేత్తలు...చేసే పరిశోధనలను ప్రొత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రంగాల్లో పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లకుండా....స్వదేశంలోనే తమ పరిశోధనలు చేసేందుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. PhD చేసే విద్యార్థులకు...70వేల నుంచి 80వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, యూరప్‌ వంటి దేశాలకు ప్రతి ఏడాది వేలాది మంది భారతీయులు వెళ్తున్నారు. ఆయా దేశాల్లో పరిశోధనలు చేసి ఆ దేశాల అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఈ మేధోవలసలను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. IIT, IISER, NIT స్టూడెంట్లకు విదేశాలు ఇచ్చే ప్రొత్సాహాకాలకు ధీటుగా ప్రధాన మంత్రి రీసెర్చ్‌ ఫెలోషిప్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయింది. 

బీటెక్‌ లేదా ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, NIT, IIT చివరి సంవత్సరం విద్యార్థులు ప్రధాన మంత్రి రీసెర్చ్ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. PhD చేసే విద్యార్థులకు ప్రొత్సాహకంగా నెలకు 70 వేల నుంచి 80 వేలు స్కాలర్‌ షిప్‌‌తో పాటు రీసెర్చ్‌ గ్రాంట్స్ కింద ఏడాదికి 2లక్షల రూపాయలు అందించనుంది. ఇందు కోసం 1,650 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది. ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు క్యుములేటివ్‌ గ్రేడ్ పాయింట్‌ యావరేజ్‌ 8.5గా నిబంధన విధించింది. పీఎంఆర్ఎఫ్‌ స్కీమ్‌ 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. 

ప్రధాన మంత్రి రీసెర్చ్ ఫెలోషిప్‌‌కు అర్హులైన విద్యార్థుల భారీగా స్కాలర్‌ షిప్ అందనుంది. మొదటి రెండేళ్ల పాటు 70వేలు, మూడో ఏడాది 75వేలు, చివరి రెండేళ్లు 80వేలు అందించనుంది కేంద్రం. అంతర్జాతీయ కాన్ఫ్‌రెన్స్‌లు, సెమినార్లలో తమ పరిశోధన పత్రాలను సమర్పించేందుకు అవసరమైన ప్రయాణ, ఇతర ఖర్చుల కోసం ఐదేళ్లపాటు అదనంగా ఏటా రూ.2 లక్షలు రీసెర్చ్‌ గ్రాంటుగా ఇవ్వనుంది. 
 

English Title
PM Narendra Modi grants Rs 80,000/month PhD scholarship to plug brain drain

MORE FROM AUTHOR

RELATED ARTICLES