పీఎం మోడీని చంపే కుట్ర జరుగుతోందా?

Submitted by santosh on Fri, 06/08/2018 - 14:20
pm modi movoist letter

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హతమార్చే ప్రయత్నాల్లో మావోయిస్టులు కుట్ర పన్నారట. నిషేధిక మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగివున్న ఐదుగురిని తాము బుధవారం అదుపులోకి తీసుకోగా.. వీరిలో ఒకరి నివాసం నుంచి ఓ లేఖను సీజ్ చేశామని పుణే పోలీసులు స్థానిక సెషన్స్ కోర్టును నివేదిక ఇచ్చారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హతమార్చిన తరహాలోనే మోదీని అంతమొందించే దిశగా మావోలు ఉన్నట్లు లేఖ ద్వారా తెలుస్తోంది.  
 
అరెస్టయిన ఐదుగురిలో ముంబైకి చెందిన సుధీర్ ధవావే, నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సురేంద్ర గండ్లింగ్, షోమా సేన్, మహేష్ రావత్, ఢిల్లీకి చెందిన రోనా జాకబ్ వున్నారు. వీరికి సెషన్స్ కోర్టు 14వరకు పోలీసుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. నిందితుల్లో ఒకరైన రోనా జాకబ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో ఎం-4 రైఫిల్ నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేసేందుకు దాదాపు ఎనిమిది కోట్లు అవసరమని పేర్కొనడం జరిగిందని.. రాజీవ్ గాంధీ తరహా హత్య కుట్ర ఇందులో వుందని చెప్పుకొచ్చారు. మోదీ హిందుత్వ పాలన చేస్తున్నారని.. ఇది గిరిజన వాసులపై ప్రభావం చూపుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. 

English Title
pm modi movoist letter

MORE FROM AUTHOR

RELATED ARTICLES