కర్ణాటక సీఎంకు మోదీ సవాల్‌

Submitted by arun on Wed, 06/13/2018 - 11:14
modihd

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన ఫిట్ నెస్ సవాలును స్వీకరించి... తాను ఎక్సర్ సైజ్ లు చేస్తున్న ఓ వీడియోను  పోస్టు చేశారు  ప్రధాని నరేంద్ర మోడీ. కర్ణాటక సీఎం  కుమారస్వామి తన ఫిట్ నెస్ చూపాలని సవాల్ విసిరారు. ఆయనతో పాటు కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా, 40 ఏళ్ల వయసు దాటిన ఐఏఎస్ అధికారులనూ చాలెంజ్ చేశారు. ఇక తన ఫిట్ నెస్ వీడియోలో పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంలతో మమేకమైతే ఎంతో ప్రేరణ పొందవచ్చని... ఆపై ఉత్సాహంగా రోజు సాగుతుందన్నారు  మోడీ. 

 ప్రధాని నరేంద్ర మోడీ తనను టార్గెట్ చేస్తూ ఫిట్ నెస్ చాలెంజ్ చేయడంపై కర్ణాటక సీఎం కుమారస్వామి వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ప్రియమైన నరేంద్రమోడీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు... శారీరక ఫిట్ నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతానని అన్నారు.  ఫిట్ నెస్ చాలెంజ్ కి నేను మద్దతిస్తున్నానన్నారు.  యోగా, ట్రెడ్ మిల్ నా దైనందిన జీవితంలో భాగమేనని... నా రాష్ట్ర ప్రజల ఫిట్ నెస్ ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలన్నారు. 
 

English Title
PM Modi invites Karnataka CM Kumaraswamy to take fitness challenge

MORE FROM AUTHOR

RELATED ARTICLES