అడ్వాణీని మోదీ ఇలా అవమానించారు

Submitted by arun on Wed, 06/13/2018 - 15:53
rahul

బీజేపీ సీనియర్‌ నేత ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవం ఇవ్వట్లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ కంటే తమ పార్టీయే ఆయనను ఎక్కువ గౌరవిస్తోందని ముంబయిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌ అన్నారు. తాజాగా, ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ మరోసారి ఇదే విషయంపై విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌గా..‘ ఏకలవ్యుడు గురువు కోరిక మేరకు తన కుడి బొటన వేలిని త్యాగం చేశాడు. కానీ బీజేపీ మాత్రం తమ గురువులను దూరం పెట్టింది.  అటల్‌ బిహారీ వాజ్‌పెయ్‌, ఎల్‌కే అడ్వాణీ, జస్వంత్‌ సింగ్‌ వంటి అగ్రనేతలను వారి కుటుంబాలను అవమాన పరచడమే భారతీయ సంస్కృతి రక్షించడమని మోదీ భావిస్తున్నారు.’  అని రాహుల్‌  పేర్కొన్నాడు.

English Title
"PM Modi Doesn't Respect 'Guru' LK Advani": Rahul Gandhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES