కాసేపట్లో తెలంగాణలో మోడీ పర్యటన

కాసేపట్లో తెలంగాణలో మోడీ పర్యటన
x
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచార సభల్లో తొలిసారి పాల్గొనబోతున్నారు. ఇవాళ నిజామాబాద్‌, మహబూబ్‌...

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచార సభల్లో తొలిసారి పాల్గొనబోతున్నారు. ఇవాళ నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌‌లలో జరిగే బహిరంగ సభలకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో మోడీ పాల్గొంటారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్‌కు చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు. నిజామాబాద్‌ సభ తర్వాత మోడీ మహబూబ్‌ నగర్‌ వెళ్ళి ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.

నిజామాబాద్‌ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే మోడీ బహిరంగ సభకు.. ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో మోడీ పాల్గొంటున్న తొలి సభ కావడంతో బీజేపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది జనం హాజరయ్యేలా జనసమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని నియోజకవర్గాల నుంచి ప్రజల్ని తరలిస్తున్నారు. ప్రధాని సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక భద్రతా విభాగంతో పాటు ఎస్పీజీ సిబ్బంది సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని సభ జరిగే పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా 16 పార్కింగ్ స్ధలాలను ఏర్పాటు చేశారు.

జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నేతలు, ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తరుపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. ఇక ప్రధాని మోడీ మొత్తం మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారునున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌, దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌ సభల్లో మోడీ పాల్గొంటారు. అలాగే డిసెంబరు 3న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగలో మోడీ ప్రసంగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories