నటుడు ప్రకాశ్ రాజ్ హత్యకు కుట్ర!

Submitted by arun on Wed, 06/27/2018 - 16:48
Prakash Raj

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది. ఎంక్వైరీ సందర్భంగా సిట్‌కు షాకిచ్చే నిజాలు తెలిశాయి. నటుడు ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం వెలుగు చూసింది. గౌరీ లంకేష్‌ను హత్య చేసినవారే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను ఓ ప్రముఖ కన్నడ వార్తా ఛానెల్ ప్రసారం చేసింది. ట్విట్టర్‌లో దీన్ని కోట్ చేసిన ప్రకాశ్ రాజ్ తనపై జరిగిన హత్య కుట్రపై స్పందించారు. ‘‘ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఇక నుంచి నా గళం మరింత పెరుగుతుంది’’ అని అన్నారు.
 
కాగా, జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటూ అప్పట్లో ప్రకాశ్ రాజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె హత్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కూడా అన్నారు. ఈ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నేరుగానే విమర్శలు గుప్పించారు.

English Title
Plans To Kill Actor Prakash Raj

MORE FROM AUTHOR

RELATED ARTICLES