ఎయిర్‌పోర్టులోనే కుప్పకూలిన విమానం

Submitted by arun on Mon, 03/12/2018 - 15:29
Plane crash

నేపాల్ రాజధాని ఖఠ్మాండు త్రిభువన్ ఎయిర్ పోర్టులో.. భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఢాఖా నుంచి ఖాఠ్మాండుకు వచ్చిన యూఎస్ బంగ్లా విమానం ఒకటి.. రన్ వే పై ల్యాండ్  అవుతుండగా.. ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీ చుట్టుముట్టాయి. ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. 

ఇటు ప్రమాదం సమయంలో విమానంలో 67 మంది ప్రయాణీకులతో పాటు.. ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మరోవైపు విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది.. రంగంలోకి దిగింది. మంటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించింది. ఇప్పటివరకు 24 మంది ప్రయాణీకులను రక్షించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. కనీసం 20 మంది మంటలకు ఆహుతైనట్లు తెలుస్తోంది. సహాయకచర్యలకు ఆటంకం కలగకుండా.. ప్రస్తుతానికి త్రిభువన్ ఎయిర్ పోర్టును మూసేశారు. 

US-Bangla Airline plane crashes at Nepal's Kathmandu Tribhuvan International Airport - Sakshi

English Title
Plane crash at Nepal's Kathmandu airport

MORE FROM AUTHOR

RELATED ARTICLES