విమానంలో పైలెట్ ప్రేమ వ్య‌వ‌హారం

విమానంలో పైలెట్ ప్రేమ వ్య‌వ‌హారం
x
Highlights

విమానంలో పైలెట్ చేసిన ప్రేమ వ్య‌వ‌హారం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. విమానంలో పైలెట్ ఏం చేస్తుంటాడు. ప్ర‌యాణికుల్ని గ‌మ్య‌స్థానాల‌కి...

విమానంలో పైలెట్ చేసిన ప్రేమ వ్య‌వ‌హారం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. విమానంలో పైలెట్ ఏం చేస్తుంటాడు. ప్ర‌యాణికుల్ని గ‌మ్య‌స్థానాల‌కి చేర్చ‌డం. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త గురించి సంకేతాలిస్తుంటాడు. కానీ ఓ పైలెట్ మాత్రం అందుకు భిన్నంగా ప్ర‌యాణికుల ముందే త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసి నెట్టింట్లో హాట్ టాపిగ్గా మారాడు. డెట్రాయిట్ కు చెందిన ఓ విమానం కొద్ది సేప‌ట్లో ఒక్ల‌హామకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ స‌మ‌యంలో డెట్రాయిట్ కు చెందిన విమానం క్యాబిన్ నుంచి పైలెట్ జాన్ ఎమ‌ర్సన్ భ‌య‌ట‌కి వ‌చ్చాడు. అనంత‌రం త‌న జేబులోనుంచి ఓ ఖ‌రీదైన ఉంగ‌రం బ‌య‌ట‌కు తీసి పెళ్లి ప్రపోజ‌ల్ పెట్టాడు. పైలెట్ నిర్వాహ‌కంపై విమానం లో ఏం జ‌రుగుతోంది తెలియ‌క ప్ర‌యాణికులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అయితే తాను స‌హ‌చ‌ర ఉద్యోగి గిబ్స్ ను ప్రేమిస్తున్నాంటూ ఆ ఉంగ‌రాన్ని ఆమెకు అందించాడు. వెంటనే ఆమె ఓకే కూడా చెప్పేసింది. ఈ వీడియోను ఆ పైలెట్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. పైలెట్ ప్రేమ ప్రపోజ‌ల్ పై ఫిదా అయిన 1.8 లక్షల మంది ఆ వీడియోను చూశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories