తల్లికి ఎస్పై పాదాభివందనం ..ఫోటో వైరల్

x
Highlights

కర్నాటకలో ఓ పోలీసు అధికారి తన మాతృమూర్తి కాళ్లకు మొక్కుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే పోలీసు శిక్షణ ముగించుకుని సబ్ ఇన్...

కర్నాటకలో ఓ పోలీసు అధికారి తన మాతృమూర్తి కాళ్లకు మొక్కుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే పోలీసు శిక్షణ ముగించుకుని సబ్ ఇన్ స్పెక్టర్ గా డ్యూటీలో జాయిన్ కావాల్సిన ఆయన ముందుగా ఇంటికి వెళ్లి తన తల్లి కాళ్లకు మొక్కాడు. తండ్రి అకాల మరణం చెందడతో తల్లే అన్నీ తానైంది. కష్టపడి కొడుకుని చదివించింది. ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. తల్లి కష్టం కళ్లారా చూసిన కొడుకు విధుల్లో చేరే ముందు తల్లి కాళ్లకు మొక్కాడు. అలా తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఓ ఐపీఎస్ అధికారి తన సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేయగా ఇప్పుడా ఫొటో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories