భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
x
Highlights

16 రోజుల పాటు వరుసగా వినియోగదారులకు వాత పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు... గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గింపు బాట పట్టాయి. నేడు కూడా గత 10...

16 రోజుల పాటు వరుసగా వినియోగదారులకు వాత పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు... గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గింపు బాట పట్టాయి. నేడు కూడా గత 10 రోజులతో పొలిస్తే ఈ రోజు ధరలు భారీగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 40 పైసలు, డీజిల్ పై 30 పైసలను తగ్గించినట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఈ ఉదయం 6 గంటల నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59కి, డీజిల్ ధర రూ. 74.22కి తగ్గింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.84కి, డీజిల్ ధర రూ. 75.20కి తగ్గింది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.02, ముంబైలో రూ. 84.84, కోల్ కతాలో రూ. 79.68గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories