తగ్గుముఖం పట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు

తగ్గుముఖం పట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు
x
Highlights

గతకొంత కాలంగా పడి లేస్తూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(గురువారం) స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా దిగి వస్తున్న తరుణంలో...

గతకొంత కాలంగా పడి లేస్తూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(గురువారం) స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా దిగి వస్తున్న తరుణంలో దేశీయంగా కూడా పెట్రోలు , డీజిల్‌ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. లీటరు పెట్రోలుపై సగటున 21పైసలు, డీజిల్‌ పై 18పైసలు మేర ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో : లీటర్ పెట్రోల్ ధర లీటరు రూ. 78.21కు ఉంటే, డీజిల్ ధర లీటరు రూ. 72.89 ఉంది. అలాగే కోలకతాలో: లీటర్ పెట్రోల్ రూ. 80.13, డీజిల్ ధర రూ.74.75 ఉంది. ఇక ముంబైలో : లీటర్ పెట్రోల్ ధర రూ.83.72, డీజిల్ ధర రూ.76.38గా ఉంది. చెన్నైలో : లీటర్ పెట్రోల్ రూ. 81.24, డీజిల్ ధర రూ.77.05 కు చేరింది. ఇక ఆంధ్ర తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్‌: లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 82. 93, డీజిల్ 22 పైసలు తగ్గి లీటరు రూ. 79.31 కు చేరింది. విజయవాడలో: లీటర్ పెట్రోల్ 82.11, డీజిల్ ధర రూ. 78.08

Show Full Article
Print Article
Next Story
More Stories