అమ్మాయిలకు స్వీట్‌పాన్‌ ఇచ్చి..

అమ్మాయిలకు స్వీట్‌పాన్‌ ఇచ్చి..
x
Highlights

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి వికృత రూపాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మయూర్ పాన్ హౌస్ పేరిట నగరంలో అనేక చోట్ల పాన్ వ్యాపారాన్ని చేస్తున్న ఉపేందర్ అనే...

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి వికృత రూపాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మయూర్ పాన్ హౌస్ పేరిట నగరంలో అనేక చోట్ల పాన్ వ్యాపారాన్ని చేస్తున్న ఉపేందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపేందర్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు రంగంలో దిగి ఉపేందర్ గుట్టు రట్టు చేశారు. ఫేస్ బుక్ ద్వారా చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఉపేందర్ తన వద్ద ఉన్న పాన్‌లలో మత్తు మందును చల్లి అమ్మాయిలకు ఇచ్చేవాడు. వారు స్మృహకోల్పోయిన తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించేవాడు. వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని యువతులను బెదిరించేవాడు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కాచీగూడ పోలీసులు చాక చక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉపేందర్‌కి సహకరించిన అతడి స్నేహితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories