తినే అన్నంలో భయంకరమైన విషం

తినే అన్నంలో భయంకరమైన విషం
x
Highlights

మీరు రోజు అన్నం తింటున్నారా? ఆ బియ్యం ఆరోగ్యానికి మంచి చేస్తాయనే భావిస్తున్నారా? అయితే మీరు విషంలో కాలేసినట్టే!! అన్నం ఏంటి విషం ఏంటని...

మీరు రోజు అన్నం తింటున్నారా? ఆ బియ్యం ఆరోగ్యానికి మంచి చేస్తాయనే భావిస్తున్నారా? అయితే మీరు విషంలో కాలేసినట్టే!! అన్నం ఏంటి విషం ఏంటని ఆలోచిస్తున్నారా? మీరనుకుంటున్నది కరెక్టే. మనం బతకడానికి తింటున్నామని అనుకుంటున్న అన్నంలో కాలకుట విషం దాగుంది. ఈ ఆరెన్సిక్ కలిసి ఉన్న అన్నాన్ని ఎలా తినాలి? ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చూడండి..

మనం నమ్మినా, నమ్మకున్నా రోజూ తినే అన్నంలో భయంకరమైన విషం దాగి ఉంది. ఆర్సెనిక్ అనే పేరు గల టాక్సిక్ రసాయనం రూపంలో మనం తినేస్తున్నాం.‌ పూర్వకాలంలో రాజరిక పరిపాలన సమయంలో ప్రత్యర్థులను నిశ్శబ్దంగా మట్టుబెట్టడానికి ఉపయోగించే విషమే ఆర్సెనిక్‌. ఇంకా చెప్పాలంటే అది హండ్రెడ్‌ పర్సెంట్‌ స్లో పాయిజన్‌. ఇది ఎంత ప్రభావవంతమైనదంటే నెమ్మదిగా ఇస్తూ పోతే సహజ మరణంలా అనిపించేలా మృత్యువు పాలవుతారు. అదే పెద్ద మోతాదులో ఇస్తే వెంటనే కుప్పకూలిపోతారు.

శత్రువులను తుదముట్టించడం కోసం ఉపయోగించేందుకు ఆర్సెనిక్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్నం పెడితే సరిపోతుందా? ఇప్పుడు సమాజం ముందున్న పరిస్ధితి. వినడానికి కొంత ఇబ్బందిగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా రసాయన ఎరువులు, పురుగు మందులతో మట్టిలోకి అన్ని విషాలతో పాటు ఆర్సెనిక్‌ ఇంకుతోంది. అది మళ్లీ మొక్కల్లోంచి వరి బియ్యం రూపంలో మనుషుల దేహాల్లోకి వస్తున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. అదే విషయాన్ని ఇటీవల చాలా సర్వేలు కూడా బహిర్గతం చేశాయి.

మనలో చాలా మంది మంచి ఆరోగ్యం కోసం పాలిష్‌ చేసిన బియ్యం కాకుండా పాలిష్‌ చేయని ముడి బియ్యాన్ని వాడుతుంటారు. పాలిష్‌ ఎక్కువగా చేసిన బియ్యంలో పోషకాలు వెళ్లిపోతాయని, అదే ముడిబియ్యంలో పోషకాలు చాలావరకు పోవని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. ఆర్సెనిక్‌ రూపంలో బియ్యంలో ఉన్న ఈ విషపదార్థం ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందన్న చేదు నిజం ఇప్పుడు నిట్టనిలువునా ముంచేస్తోంది.

పాలిష్‌ చేయని ముడి బియ్యంలోనే ఆర్సెనిక్‌ విషం మరింత ఎక్కువగా ఉంటుంది. బియ్యం పై పొరలో ఆర్సెనిక్‌ విషం ఎక్కువగా ఉంటుంది. పుణేలోని నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీ నిపుణులు దీనిపై మరిన్ని దిగ్భ్రాంతికరమైన నిజాలు చెబుతున్నారు.

రసాయనిక ఎరువుల, పురుగు మందుల ఉపయోగంతో మనం తినే వరి అన్నం, బంగాళదుంపలలో ప్రమాదకరమైన ఆర్సెనిక్‌ విషం చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డయాబెటిస్ ఉన్న వారిని వరి అన్నం తినవద్దని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు.

సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో వరి అన్నాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. అందులో ఈ మధ్యకాలంలో రైస్ కుక్కర్ల మీద వంట వండడం కూడా చాలా ఎక్కువైంది. పోషకాలు పోతాయని బియ్యాన్ని ఎక్కువగా కడగక పోవడం, తొందరగా వండాలని రైస్ కుక్కర్‌లో ఉడికించడం లాంటివి చేయడం ద్వారా డైరెక్టుగా ఆర్సెనిక్‌ను మన శరీరంలోకి మనమే పంపిస్తున్నాం.

అందుకే ఈ ఆర్సెనిక్‌కు విరుగుడును కూడా నిపుణులు సూచిస్తున్నారు. వరి అన్నం వండినప్పుడు గంజి వార్చితే బియ్యంలోని ఆర్సెనిక్‌ విషం చాలా వరకు పోతుందని ఒక పరిష్కారం చెబుతున్నారు. అలాగే మరికొన్ని ప్రత్యామ్నాయ ఆహారాలను సూచిస్తున్నారు నిపుణులు. థయామిన్‌ పుష్కలంగా ఉండే కొర్రలు వంటి చిరుధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటే ఆర్సెనిక్‌ బాధ తప్పుతుందని, థయామిన్‌ కొరత ఉండదు కాబట్టి డయాబెటిస్‌ సమస్య కూడా రాకుండా ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

మనం తినే ఆహారంలో ప్రతి దానిలో కల్తీ అనీ, కాలుష్యమనీ ప్రతిరోజూ వింటూ ఉన్నాం..చివరకు చిన్నా వాళ్ల వరకు పల్లెటూరు నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరు తినే అన్నం కూడా ఇలా విషమయం అవుతోందంటే భవిష్యత్తు ఏంటని ప్రశ్నార్దకంగా మారుతోంది. అందుకే వీలైనంత వరకు ఆర్గానిక్ రైస్‌ను లేదంటే ఉన్న బియ్యాన్నే ఎక్కువగా కడుక్కొని వండుకోవడం శ్రేయస్కరం.

Show Full Article
Print Article
Next Story
More Stories