పాతబస్తీలో దారుణం....మహిళలపై పెప్పర్‌ స్ప్రే దాడి..!

Submitted by arun on Mon, 08/06/2018 - 10:13
 Pepper spray

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. కాలాపత్తర్ పీఎస్ పరిధిలోని ఇంద్రానగర్‌లో ఆరుగురు మహిళలపై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. మహ్మద్ యాసిన్ అనే యువకుడు కారులో వెళ్తున్న ఆరుగురు మహిళలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. పారిపోతున్న నిందితుడిని కారు డ్రైవర్ స్థానికుల సాయంతో పట్టుకున్నారు.  దేహశుద్ధి చేసిన స్థానికులు యాసిన్‌ను పోలీసులకు అప్పగించారు. స్ప్రే కారణంగా అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరు విదేశీ మహిళలు కూడా ఉన్నారు. అయితే, చాలా కాలంగా ఒంటరిగా తిరిగే మహిళలను టార్గెట్ చేసిన యాసిన్ వారిపై పెప్పర్ స్ప్రేతో దాడికి దిగుతున్నట్టు తెలుస్తోంది. 

English Title
pepper spray attack on womens in hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES