ఆవుకు మరణ శిక్ష

Submitted by arun on Thu, 06/14/2018 - 13:51
cow

మరణ శిక్ష ఎవరికి విధిస్తారు ? అంటే మనుషులకేనని ఠకీమని చెప్పేస్తాం. కానీ నోరు లేని  మూగజీవికి మరణ శిక్ష విధించి...ఓ దేశం వివాదాన్ని కొని తెచ్చుకుంది. చివరకు సొంత దేశ ప్రజల నుంచే వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఆవుకు విధించిన మరణ శిక్షను రద్దు చేసింది. ఇంతకు ఆవుకు మరణ శిక్ష ఎందుకు వేశారు. ఎందుకు రద్దు చేశారు. ఈ విషయాలు తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బల్గేరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. విశ్వంలో ఉన్న ఏ దేశమైనా ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే మరణశిక్షలు విధించంది. అయితే బల్గేరియాప్రభుత్వం...అక్రమంగా దేశ సరిహద్దులు దాటి సెర్బియాలోకి వెళ్లినందుకు ఆవుకు శిక్ష వేసింది. 

బల్గేరియా దేశానికి చెందిన పెంకా అనే ఆవు...తోడేళ్లు వెంటపడటంతో ఆ దేశ సరిహద్దులు దాటి సెర్పియాలోకి ప్రవేశించింది. ఈ విషయం గుర్తించిన ఆవు యజమాని....సెర్బియా నుంచి తిరిగి తీసుకొస్తుండగా భద్రతాధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా యూరోపియన్‌ యూనియన్‌లో ఎందుకు ప్రవేశించారంటూ బల్గేరియా అధికారులు అడ్డుకున్నారు. సరైన గుర్తింపు పత్రాలు లేవనే కారణంతో వారి దేశ చట్టాల ప్రకారం ఏకంగా మరణశిక్ష విధించారు. అయితే ఆ శిక్ష అమలు చేయడానికంటే ముందే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బల్గేరియా ప్రభుత్వం ఆవుకు మరణశిక్ష విధించడంపై...అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయ్. పెంకాను రక్షించాలంటూ... పెద్ద ఎత్తున ప్రజలు సంతకాల ఉద్యమం చేశారు. ఇదే సమయంలో ఆ ఆవుకు వైద్యపరీక్షలు చేస్తున్న సమయంలో అది గర్భంతో ఉన్న విషయం తెలిసింది. ఈ విషయం కూడా బయటకు రావడంతో ఆవుకు మద్ధతు రెట్టింపైంది. గర్భంతో ఉన్న ఆవును ఎలా చంపుతారని ప్రశ్నిస్తూ ఉద్యమం జరిగింది. అయితే ఆవు కారణంగా తమ దేశంలోకి ఏవైనా రోగాలు వచ్చి ఉంటాయని  బల్గేరియా ఆందోళన  వ్యక్తం చేసింది. తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం బల్గేరియాకు వ్యతిరేకంగా ఆవుకు మద్ధతుగా పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టడంలో ఆవు యజమాని విజయం సాధించాడు.

గర్భంతో ఉన్న పెంకాకు ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో...ఏలాంటి వ్యాధులు సోకలేదని తేలింది. ఓవైపు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతోపాటు అన్ని అంశాలను పరిగణలోని తీసుకున్న బల్గేరియా ప్రభుత్వం...పెంకాకు వేసిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరణ శిక్షను రద్దు చేయడంతో పెంకా అనే అవుతో...మరో బుల్లి పెంకాకు జన్మనివ్వనుంది. దీంతో పెంకా యజమాని ఇవాన్‌ హరాల్పీవ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆవు పులి కథలో ఆవు నోటి దాకా వెళ్లి చివరకు క్షేమంగా బయటపడ్డట్టుగా ఇప్పుడా ఆవు కూడా బయటపడి అందరి దృష్టిలో పడింది.

English Title
Penka the cow faces DEATH SENTENCE

MORE FROM AUTHOR

RELATED ARTICLES