గొంతులో పెన్ను

Submitted by arun on Fri, 08/10/2018 - 12:29

పెన్ను క్యాప్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. స్కూల్లో పెన్ను క్యాప్‌తో ఆడుకొంటున్న బాలుడు దానిని పొరపాటున మింగి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురంలో జరిగింది. నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన వినయ్ మూడో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూలుకు వెళ్ళిన వినయ్ గ్రౌండ్‌లో ఆడుకొనే సమయంలో పెన్ను క్యాప్‌‌ను నోట్లు పెట్టుకున్నాడు. అది పొరపాటున గొంతులో ఇరుక్కుపోవడంతో వినయ్ ఊపిరాడక చాలాసేపు ఇబ్బంది పడ్డాడు. విషయం గమనించిన ఉఫాద్యాయులు వినయ్ గొంతులో ఉన్న పెన్ను క్యాప్ తీయడానికి విఫల యత్నం చేశారు. తర్వాత ఆ బాలుణ్ణి ఆస్పత్రికి తరలించగా అతను చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. వినయ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

English Title
Pen Cap Stuck In Student's Throat

MORE FROM AUTHOR

RELATED ARTICLES