బీజేపీకి మహెబూబా ముఫ్తీ స్ట్రాంగ్ వార్నింగ్

బీజేపీకి మహెబూబా ముఫ్తీ స్ట్రాంగ్ వార్నింగ్
x
Highlights

పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్రాన్ని హెచ్చరించారు. 1987లో కశ్మీర్‌లో...

పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్రాన్ని హెచ్చరించారు. 1987లో కశ్మీర్‌లో ఎలా ఉగ్రవాదం పెరిగిపోయిందో మరచిపోవద్దన్న ముఫ్తీ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో 90ల పరిస్థితి కశ్మీర్‌ లోయలో పునరావృతం కావచ్చని హెచ్చరించారు. అంతేకాకుండా 1987 తరహాలో ప్రజల ఓటు హక్కును ఢిల్లీ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. విభజన రాజకీయాలు, పార్టీల్లో జోక్యం పెరిగితే సలావుద్దీన్‌, యాసిన్ మాలిక్‌లు మళ్లీ పుట్టే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.

కశ్మీర్‌ లోయలో తలెత్తే పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు. మూడేళ్ల పాటు పీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ ఇటీవలే పీడీపీతో తెగతెంపులు చేసుకుంది. దీంతో మెహబూబా ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కశ్మీర్‌‌లో గవర్నర్ పాలనను అమల్లోకి తెచ్చింది కేంద్రం. పీడీపీలోని అసమ్మతి ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు మెహబూబా ముఫ్తీని ఆగ్రహానికి గురిచేస్తున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories