వ్యభిచారం మానేస్తున్నాం !

Submitted by arun on Thu, 08/09/2018 - 13:55
Yadadri child sex racket

పోలీసుల వరుస దాడులతో యాదాద్రిలో వ్యభిచార గృహాలకు తాళాలు పడ్డాయి. పసిపిల్లల్ని పడుపు వృత్తిలోకి దించి కాసులు పోగేసుకుంటున్న దుర్మార్గులు పత్తా లేకుండా పోయారు. దాంతో వ్యభిచారానికి అడ్డాగా నిలిచిన ఇళ్లూ, పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. అయితే బాధిత చిన్నారుల్లో కొందరు మాత్రమే దొరకగా, మిగిలినవారిని వ్యభిచార నిర్వాహకులు తీసుకొని పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దాంతో వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇన్నాళ్లూ మూడు పువ్వులు ఆరు కాయలుగా యాదగిరిగుట్టలో వ్యభిచారం నిర్వహించిన వారంతా పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టారు. భారీ భవంతులతోపాటు సొంత లాడ్జిలను సైతం నిర్మించుకున్నారు. అయితే యాదాద్రిలో వ్యభిచారాన్ని పూర్తిగా రూపుమాపాలనుకుంటోన్న పోలీసులు సుమారు 200 ఇళ్లను సీజ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పోలీసుల వరుస దాడులతో యాదాద్రి గణేష్‌నగర్‌‌లో వ్యభిచార గృహాలకు తాళాలు పడ్డాయి. ఇప్పటికే పలు ఇళ్లను సీజ్‌ చేసిన పోలీసులు 11మందిని అరెస్ట్‌చేసి ఐదుగురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. అయితే నిత్యం పోలీసుల నిఘా ఉంటేనే యాదాద్రిలో సమూలంగా వ్యభిచారం కనుమరుగు అవుతుందంటున్నారు స్థానికులు.

పోలీసుల వరుస దాడులతో యాదాద్రి వ్యభిచార నిర్వాహకుల్లో మార్పు వస్తున్నట్లే కనిపిస్తోంది. పోలీసుల చర్యలతో గణేష్‌నగర్‌ మొత్తం బోర్డులు వెలిశాయి. ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా అంటూ వీధివీధినా బోర్డులు ఏర్పాటుచేశారు. స్వచ్ఛందంగా పడుపు వృత్తిని మానేస్తున్నామని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, బలవంతం చేసినా పోలీసులకు అప్పగిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

English Title
PD Act invoked against 5 women for illegal activities in Yadadri

MORE FROM AUTHOR

RELATED ARTICLES