ఫ్యాన్ కు ఉరి వేసుకుని సినీనటి ఆత్మహత్య

Submitted by nanireddy on Thu, 09/06/2018 - 18:18
payel-chakraborty-found-hanging-hotel-room

ఫ్యాన్ కు ఉరి వేసుకుని సినీనటి ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో చోటుచేసుకుంది. ఆమె బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్‌ చక్రబోర్తి(38) గా గుర్తించారు. కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న పాయెల్‌ చక్రబోర్తి కుటుంబసమస్యలు కారణంగా ఆత్మహత్య చేసుకుని  ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని సిబ్బందితో చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదని సిబ్బంది పోలీసుకు తెలిపారు. కాగా నటి పాయెల్‌ సినిమాలు, టీవీ సీరియల్‌లు, పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. చోఖేర్‌ తారా తుయ్‌, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. పాయోల్‌ మృతి పట్ల పశ్చిమబెంగాల్‌ సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు సంతాపం వ్యక్తం చేశారు. 

English Title
payel-chakraborty-found-hanging-hotel-room

MORE FROM AUTHOR

RELATED ARTICLES