డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టే "బొప్పాయి ఆకుల రసం"

Submitted by admin on Wed, 12/13/2017 - 13:08

బొప్పాయి 'కాయ' జీర్ణశక్తి తోడ్పడితే, 'పండు' పోషకాలని అందిస్తుంది. బొప్పాయి  పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు ఉంటాయి.  బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేస్తుంది. బొప్పాయి ఆకుల రసం డెంగ్యూ జ్వరము వచ్చినపుడు వాడితే ప్లేట్లెట్ల కౌంటు పెరగడానికి పనిచేస్తుంది.

కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఇందులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలోని  విటమిన్ సి  దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది.  సబ్బులు, క్రీముల్లో కూడా బొప్పాయిని ఎక్కువగా వాడుతున్నారు. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి, తామర వ్యాధిని తగ్గిస్తుంది.పచ్చికాయ అధిక రక్తపోటుని  నియంత్రిస్తుంది. మధుమేహం  కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది. గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే  త్వరగా తగ్గిపోతాయి.
పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్‌ ఆయింట్‌మెంట్‌ తయారుచేస్తారు. బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది 
 బొప్పాయి కాయలు గర్భస్రావాన్ని కలుగజేస్తాయి. దీనికి ముఖ్యకారణం అందులో ఉండే 'పపైన్‌' (పాలు). ఇది గర్భాశయంలో ప్రారంభదశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ ఉండే ప్రొటీనులను కరిగించివేస్తుంది. అందువల్ల గర్భిణిస్త్రీలు, పాలిచ్చే తల్లులు బాగా పండిన బొప్పాయి పండు తినటం మంచిది.

English Title
paya-leaves-cure-health-problems

MORE FROM AUTHOR

RELATED ARTICLES